HD Kumaraswamy: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు విడుదలయ్యే తేదీ మే 13పై ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ విజయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం ఆ రోజే తేలనుంది. ఇదిలా ఉంటే ప్రతీ పార్టీ నాయకుడు కూడా తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సారి కింగ్ మేకర్ కాదు కింగ్ కాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న…
karnataka Exit Poll: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలకంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఈ రోజు 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.
Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆసక్తికర కామెంట్లు చేశారు.. నేను సీఎం బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకి కాదని స్పష్టం చేశారు.. అయితే, నేను స్టార్…
జేడీఎస్ ఎన్నికల అనంతర పొత్తును కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రద్దు చేశారు. తమ పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "జేడీఎస్‌తో పొత్తుకు అవకాశం లేదు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము." అని శివకుమార్ కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు.
Karnataka Elections 2023: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ కి అంతా రెడీ అయ్యింది. దాదాపుగా 38 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఎలక్షన్స్ సాఫీగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపు అనగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరుగుతుంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతుంది. 2 వేల 615మంది…
Karnataka Elections: కర్ణాటకలో 20 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. అందుకే ఆఖరి పంచ్ ఐటీ సిటీలో ఇచ్చాయి ప్రధాన పార్టీలు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా…
శివాజీనగర్ నుంచి లింగరాజపురం వెళ్తున్న బీఎంటీసీ బస్సు రావడంతో టక్కున బస్సు ఎక్కి అందులో ఉన్న విద్యార్థులకు, ప్రయాణికులకు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. లింగరాజపురం బస్సులో ఉన్న విద్యార్థులు, మహిళలతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణించి వారి సమస్యను తెలుసుకున్నారు.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారెంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.