Sneha: అప్పుడు మంచానికే పరిమితం అయ్యా.. హీరోయిన్ స్నేహ ఎమోషనల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు తెరపై హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి స్నేహ. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సౌందర్య తర్వాత అంతటి మన్ననలు పొందిన ఈమె, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యారు. పెళ్లి, పిల్లల వల్లే ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారని అందరూ భావించినప్పటికీ, దాని వెనుక ఒక చేదు జ్ఞాపకం దాగి ఉందని తాజాగా ఆమె వెల్లడించారు. ఒక ప్రమాదం తన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో వివరిస్తూ స్నేహ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
స్నేహా మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఒక ఘోర ప్రమాదానికి గురయ్యా. ఆ ప్రమాదంలో నా కాళ్లు, చేతులు,వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం లేచి నిలబడాలన్నా ఎనిమిది నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు తేల్చి చెప్పడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యా. ఇక ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న. కానీ దర్శకుడు కరు పళనియప్పన్ ‘పార్థిబన్ కనవు’ కథతో నను సంప్రదించారు. అసలు కదల్లేని స్థితిలో ఉన్న అని తెలిసి కూడా సినిమా కోసం పిలవడం చూసి ఆశ్చర్యపోయా, కానీ ఆ దర్శకుడు ఇచ్చిన ధైర్యం, చూపించిన నమ్మకమే మళ్ళీ నన్ను కోలుకునేలా చేసింది. ఆ ప్రోత్సాహం వల్లే మళ్ళీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఆమె గుర్తుచేసుకుని స్నేహ ఎమోషనల్ అయ్యారు.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!