Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే, అతని కుటుంబాన్ని చంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని ఆరోపించింది. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ హిస్టరీ షీటర్ అయిన మణికంఠ రాథోడ్ ను రంగంలోకి దింపిందని బీజేపీని కాంగ్రెస్ నిందించింది. మనికంఠ అనుచిత పదజాతంలో ఖర్గేను దూషించాడని ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ లను బెంగళూర్ లో విలేకరులు సమావేశంలో ప్లే చేసింది.
Read Also: Jammu Kashmir: వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదుల హతం.. కేంద్రం అప్రమత్తం..
ఖర్గే, అతని భార్య, పిల్లలను హత్యకు కుట్ర పన్నడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. ప్రధాని, ఎన్నికల సంఘం, కర్ణాటక పోలీసులు మౌనంగా ఉంటారని మాకు తెలుసు కానీ.. కర్ణాటక ఓటర్లు మౌనంగా ఉండలేరని తగిన సమాధానం ఇస్తారని సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. బెంగళూర్ లో ప్రధాని మోడీ మెగా రోడ్ షో ముందు కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యతన సంతరించుకుంది.
చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపై బీజేపీ నుంచి మణికంఠ రాథోడ్ పోటీ చేస్తున్నారు. అతనిపై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కలబురిగి నుంచి మణికంఠ ఏడాది పాటు బహిష్కరణకు గురయ్యాడు. ప్రియాంక్ గార్గేని హత్య చేస్తానని బెదిరిండాన్న ఆరోపణలపై గతేడాది నవంబర్ 15న అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలయ్యాడు.