PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకోబోతోంది. ఎన్నికలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. బెంగళూర్ సౌత్ లోని సోమేశ్వర్ భవన్ ఆర్‌బిఐ గ్రౌండ్ నుండి మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్ వరకు 26 కి.మీ రోడ్‌షో సుమారు మూడు గంటల్లో పూర్తయింది. దక్షిణ, మధ్య బెంగళూర్ లోని దాదాపుగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుతూ రోడ్ షో నిర్వహించారు.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాకు టాక్స్ రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ప్రధాని వెంట బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు బెంగళూర్ సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో భజరంగ్ దళ్ బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టడంతో, కర్ణాటక వ్యాప్తంగా ‘జైభజరంగబలి’ నినాదాలు కర్ణాటక ప్రచారంలో కీలకంగా మారాయి. ఈ రోజు మోడీ రోడ్ షోలో బీజేపీ మద్దతుదారులు హనుమాన్ వేషధారణ వచ్చారు. జై భజరంగబలి, భారత్ మాతాకు జై, జై మోడీ నినాదాలతో రోడ్ షో హోరెత్తిపోయింది. ఇదిలా ఉంటే తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుండి ట్రినిటీ సర్కిల్‌కు మధ్య 10 కి.మీ.ల పొడవునా చాలా చిన్న రోడ్‌షో ఆదివారం జరగనుంది.
మే 10న కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. బీజేపీ అధికారంలో మరోసారి రావాలనుకుంటోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టాలని భావిస్తోంది. జేడీయూ కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది.