దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు. పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ…