త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, మహిళలకు నగదు-ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.
Off The Record: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా…ఆ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని కాషాయ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు జరిగిన చోట బీజేపీ గెలిస్తే ఇక్కడా చేరికలు ఉంటాయట. ఐతే…చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. పలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం వారు ఊహించిన స్థాయిలో చేరికలు జరగనేలేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగి బీజేపీ గెలిస్తే ఆ ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్…
బీజేపీ అధినేత జేపీ నడ్డా సోమవారం బెంగళూరులోని పార్టీ ప్రధాని కార్యాలయంలో మే 10న కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ‘ప్రజాధ్వని’ని విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో…
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి…
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటివరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు.