సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు.
Four people died due to an elusive disease in Karimnagar district: కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. అంతుచిక్కని వ్యాధితో కుటుంబంలోని సభ్యులు వరసగా మృతిచెందారు. నెల రోజు వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన ఓ కుటుంబంలో అంతుచిక్కని వ్యాధి పెను విషాదాన్ని నింపింది. 40 రోజుల్లో శ్రీకాంత్, భార్య మమతతో పాటు కూతురు అమూల్య(6), అద్వైత్(20 నెలలు) ఒకరి తరువాత…
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి పద్మశ్రీ భాష్యం విజయ్ సారథి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ సారథి కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్…
రీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కరీంనగర్ సభ నేపథ్యంలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేసావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని…
కరీంనగర్ జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడిచేశారు. ఈదాడిలో కూతురు అక్కడికక్కడే మరణించగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.