Home
Karimnagar
Karimnagar News
-
Metro Express: కరీంనగర్‌లో ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
కరీంనగర్ నగరవాసులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులను జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న నగర జనాభా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో భాగంగా ఆర్టీసీ కరీంనగర్ 2 డిపో… -
Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. అందిన సమాచారం ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించేందుకు వాహనదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 130 కేసుల్లో రూ.20 లక్షల… -
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
Karimnagar: కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఘోర దారి దోపిడీ కలకలం రేపింది. ఆయుధాలతో, ముసుగులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ముఠా సభ్యులు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి, విచక్షణారహితంగా దాడి చేసి భారీగా సొత్తును దోచుకెళ్లారు. అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో, ఇంట్లో ఉన్న వృద్ధుడైన యజమాని తన కొడుకులు ఎవరైనా వచ్చారన్న భావనతో తలుపు తీశాడు. వెంటనే ముసుగులు ధరించి లోపలికి చొరబడ్డ దుండగులు అతనిపై దాడి… -
Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
కరీంనగర్ జిల్లాలో నేడు ఉదయం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే బస్సులో షార్ట్‌సర్క్యూట్… -
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
కరీంనగర్ లో కాల్పుల కలకలం రేపాయి. ప్రముఖ పీఎంజే జ్యువెల్లర్స్ షాపులోకి తుపాకులతో చొరబడ్డ ఐదుగురు దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా బంగారం ఆభరణాలు దోపిడీ చేసినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలియగానే కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తప్పించుకున్నారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీటీవీ… -
Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు. సుమారు రూ. 1,40,18,308/- మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది. గతంలో పే-సెక్షన్‌లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి, మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను దుర్వినియోగం చేసి IFMIS పోర్టల్‌లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్… -
Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!
Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలనే తన సంకల్పాన్ని ఆమె చాటుకున్నారు. Ambati Rambabu New Case: అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు.. మరో కేసులో సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్.. 80 ఏళ్ల వయసున్న యశోదకు… -
Bandi Sanjay: కరీంనగర్‌కు రూ.50 కోట్ల కేంద్ర నిధులు.. కాషాయ జెండా ఎగరడం ఖాయం..!
Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర… -
Honour Killing: కూతురికి పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేసిన తల్లిదండ్రులు!
తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో తల్లిదండ్రులే కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేశారు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురి హత్యను ఆత్మహత్యగా చిత్రికరించి.. చివరకు పోలీసులకు చిక్కారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెల 14న జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన… -
Off The Record : మానేరు మీద వరుసగా కూలిపోతున్న చెక్ డ్యామ్లు..కూలిపోతున్నాయా? కూల్చేస్తున్నారా ?
అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్‌తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్‌మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు…
తాజావార్తలు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!