తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నిత్యం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వుండే మాటల యుద్ధం ఇవాళ తారస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా?పనికిమాలిన రాజకీయం వద్దు అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ని ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. డ్రగ్ టెస్ట్ చేయించాలని ఉబలాటపడుతున్న బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్ టెస్ట్ కోసం నా రక్తం.. కిడ్నీ కూడా ఇస్తా. ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకు రా… క్లీన్ చిట్ తో బయటికి వస్తా.. ఈ విషయంలో ఓడిపోతే.. బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటారా? అన్నారు కేటీఆర్. డ్రగ్ విమర్శలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా ఘాటైన సమాధానం ఇచ్చారు.
Read Also:Alia Bhatt: బిడ్డకు పాలు ఇస్తూ అలియా.. ఫోటో వైరల్
డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటాడా..? నా రక్తం, నా చర్మం తీసుకుపోతాడా..? నా గోళ్ళు ఇస్తా…. ఏం తీసుకుపోతడో తీసుకపొమ్మను. నా వెంట్రుకలు కూడా ఇస్తా. నేను బయటకు చిత్తశుద్ధితో వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా..? నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా..? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడ్నే ఉంటాను. రమ్మను. ఏ డాక్టర్ను తీసుకోస్తడో తీసుకురమ్మను.
నా వెంట్రుకలు, నా రక్తం, నా గోర్లు, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా. ఆయనకు ఏమైనా తెలివి ఉందా? ఇదేం రాజకీయం.. మనిషా పశువా.. కరీంనగర్‌కు ఏం చేసిండో చెప్పనికి చేత కాదు.. కానీ అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు అని కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ప్రజలకేం చేస్తారో చేయండి. ప్రజలకు పనికివచ్చేది మాట్లాడమంటే సన్నాసి … ఫాల్తు మాటలు మాట్లాడడం ఏంటన్నారు. కరీంనగర్ కి ఏం చేశాడో చెప్పాలన్నారు. మాట్లాడితే హిందు అంటాడు. కొండగట్టు ఆంజనేయస్వామికి ఏమైనా తెచ్చావా? అని ప్రశ్నించారు కేటీఆర్.
Read Also: Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు