JP Nadda: సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికాడా? లేడా? అని ప్రశ్నించారు. పాదయాత్ర 1403 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చింది.. ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర.. ప్రజల గోసకు బీజేపీ భరోసా కల్పిస్తుందన్నారు.. సాలు దొర.. సెలవు దొర పక్కా అంటూ జోస్యం చెప్పారు.
Read Also: CM YS Jagan: మైల’వరం’పై జగన్ ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఇక, నేను వచ్చేటప్పుడు నా పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులపై ఫైర్ అయ్యారు జేపీ నడ్డా.. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం ‘అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక’ ప్రభుత్వం.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు.. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగింది.. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్న ఆయన.. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం.. కానీ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు.. కేసీఆర్ పాలనలో రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుంది అని ఎద్దేవా చేశారు.. టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన కేసీఆర్ పార్టీకి నెక్స్ట్ బీఆర్‌ఎస్ తప్పదని జోస్యం చెప్పారు.. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకున్నాడా? అని నిలదీశారు జేపీ నడ్డా.
తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నాడని ఆరోపించారు జేపీ నడ్డా.. “ధరణి పోర్టల్” పేరుతో.. బీఆర్ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారన్న ఆయన.. అసదుద్దీన్ ఒవైసీకి భయపడే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్ జరపడం లేదన్నారు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపిందని గుర్తుచేశారు. ఇక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైంది? వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు.. వెల్నెస్ సెంటర్ లకు బస్తీ ధవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. బస్తీ ధవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్న ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి.. తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ.. బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాదయాత్రలు ఆగవు.. పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయి. ప్రతి గడిపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాం.. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు