Congress Leaders Arrested: కరీంనగర్ లో ఉద్రిక్తత.. బండిసంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress leaders arrested in Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కరీంనగర్ సభ నేపథ్యంలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేసావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకుని ప్రతిగా బీజేపీ నాయకుల నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మమ్మల్ని అదుపులో తీసుకుని వారిని ఎందుకు వదులుతున్నారు అంటూ మండిపడ్డారు. బలవంతంగా మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు వాగ్వాదం జరిగితే ఒకరినే పోలీసులు టార్గెట్ చేయడం ఏంటిన మండిపడ్డారు. బీజేపీకి పోలీసులు మద్దతు పలకడం ఏంటిన ప్రశ్నించారు కాంగ్రెస్‌నాయకులు.
Read also: Gidugu RudraRaju: కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని సీపీఐని కోరా
Also Read
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన పాదయాత్ర 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఐదో విడత ప్రజా పోరాట యాత్ర నేడు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ముగింపు సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఎటువంటి ఉద్రికత్త చోటుచేసుకోకుండా కరీంనగర్ ను పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?