Karimnagar: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మానకొండూర్‌లో అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గన్ మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తృటిలో తప్పించుకున్నాడు.
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో ఓ రైతు కరెంట్ స్తంభం ఎక్కి బీభత్సం సృష్టించాడు. భూవివాదం కారణంగా రైతు కరెంట్ స్తంభం ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు.
లోన్ యాప్ పేరిటి మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో వెలుగు చూస్తున్న మోసాలు ఇప్పుడు జిల్లాలకు పాకింది. లోన్ మంజూరు అయ్యిందంటూ ఫోన్ చేయడం వారి ఖాతాలో వున్న డబ్బులను ఖాలీ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకుంది.
కాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు.