Scissors in Stomach: పెద్దపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఆపరేషన్ చేసి బిడ్డను తీసి కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయాడు.
కరీంనగర్ జిల్లా లో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కలకలం రేపింది. కొత్తకొండ నుండి కరీంనగర్‌లో నానమ్మ చనిపోతే ఓకుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు అక్షిత, లోకేష్. అయితే ఈ ఇద్దరి పిల్లలపై జయశ్రీ అనే వృద్ధురాలు కన్నుపడింది.
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచారు బండి సంజయ్. ఆపై సమీకరణాలు కలిసొచ్చి.. ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా సంజయ్‌ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ప్రస్తుత కమలనాధుల దృష్టంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఇదే సమయంలో కీలక నాయకులు అసెంబ్లీకి పోటీ చేసే స్థానాలపైనా కాషాయ శిబిరంలో చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే బండి సంజయ్ అసెంబ్లీకి ఎక్కడ నుంచి…
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ముస్తాబైంది.. శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామివారి ఆలయంతోపాటు ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్ మోగింది. బస్సు డ్రైవర్ల సమ్మె కారణంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఇతర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 ఎకరాల స్థలంలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను…
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈనెల రేషన్ బియ్యం పంపిణీలని ఇంకా మొదలు పెట్టలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగా.. కరోనా సమయంలో మాదిరిగా జనవరి నుంచి మరో ఏడాది పాటు కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కిలోల చొప్పున ఉచిత…