కరీంనగర్ పేలుడు కేసుతో పాతబస్తీకి లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు…