Harish Rao: సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు. కానీ వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసన్నారు మంత్రి. పోలీసులకు 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య రక్షణ కార్యక్రమం రెండేళ్లపాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరమైతే కొద్దిరోజులు పొడిగిస్తామని మల్లి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని హరీశ్ అన్నారు. అన్ని సొసైటీలు కొన్ని పనులకు దరఖాస్తులు ఇస్తారని, అయితే పోలీసు సొసైటీ దరఖాస్తులు ఇవ్వడం లేదన్నారు. ప్రజల కోసం కుటుంబాలు, పండుగలు వదిలి పోలీసులు పని చేస్తారన్నారు. పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. సిద్దిపేట అన్ని విషయాల్లో ముందు ఉంటదని, అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నంబర్ వన్ సిద్దిపేట అన్నారు మంత్రి హరీష్ రావు. భారత దేశంలో మాంసం తినే వాళ్ళలో తెలంగాణ మొదటి స్థానంలో, రాజస్థాన్ లాస్ట్ ప్లేస్ లో ఉందని మంత్రి తెలిపారు.
Read also:India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
గంగుల కమలాకర్‌ను ఓదార్చిన మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్:
తండ్రి మృతితో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లు ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్‌లు కరీంనగర్‌లోని గంగుల ఇంటికి చేరుకుని మల్లయ్య పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికొద్ది సేపట్లో మంత్రి గంగుల తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Rohit Reddy: నేడు హైకోర్టులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై విచారణ