Distribution of Ration: సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈనెల రేషన్ బియ్యం పంపిణీలని ఇంకా మొదలు పెట్టలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగా.. కరోనా సమయంలో మాదిరిగా జనవరి నుంచి మరో ఏడాది పాటు కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇచ్చేది. రాష్ట్రాల్లో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఒకొక్కరికి అయిదు కిలోలు ఇవ్వాలా? గతంలో మాదిరిగా ఆరు కిలోలు ఇవ్వాలా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
Read also: Samantha Bounce Back Soon live: ఆ చిరునవ్వు వెనుక ఎంత వ్యధ ఉందో..!
అయితే.. రాష్ట్రంలో బియ్యం పుష్కలంగా ఉన్న నేపథ్యంలో గతంలో తీసుకున్న విధాన నిర్ణయం మేరకు ఆరు కిలోలు ఇస్తే నెలకు ఎంత బియ్యం అవసరమవుతుంది? అదనపు వ్యయం ఎంత అవుతుంది? అన్న అంశంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో.. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా.. 55 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై బియ్యాన్ని కేటాయిస్తుంది. కేంద్రంతో పోలిస్తే ఆదాయ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచటంతో మరో 35 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బియ్యం పంపిణీ చేస్తోందని.. ఉచిత బియ్యం పంపిణీ విషయంలో గతంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ దఫా ఆచితూచి వ్యవహరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంగా ఉంది.
Read also: Lips Care: చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి
జనవరి 7వ తేదీ నుంచి (శనివారం) నుంచి జిల్లాలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్న ప్రభుత్వాలు ప్రకటించిన.. గత నెల వరకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అందించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. దీంతో రేషన్ డీలర్లు గురువారం నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం అందించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. గత వారంలోనే రేషన్ పంపిణీ చేస్తాయన్న వార్తలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ సంక్రాంతి దగ్గర పడుతున్న ఇప్పటి వరకు రేషన్ పంపిణీ చేయకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్రాంతికి రేషణ్ పంపిణీ చేయనుందా? లేదా? అనేప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి!