జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
Jammu Kashmir: ఈరోజు ఉదయం 7 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్‌లోని శివాలయం సమీపంలోని బట్టల్లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన 32 ఫీల్డ్ రెజిమెంట్ వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసింది. కెర్రీలోని బట్టాల్ ప్రాంతంలోని అసన్ దేవాలయం సమీపంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదుల ఉనికి గురించి గ్రామస్థులు సమాచారం అందించారని ఆర్మీ…
India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని గుల్మార్గ్, గందర్బల్ జిల్లాలోని గగాంగీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు. Read Also: Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస…
ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న విభిన్న ఉగ్రవాద దాడులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తూ.. లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ పురస్కరించుకుని ఐదు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు (శనివారం) సెలవులు ప్రకటించాయి.
Sonam Wangchuk: హోం మంత్రిత్వ శాఖ హామీ మేరకు సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తాజాగా ఆయనని జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండేను కలుసుకున్నాడు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ అత్యున్నత కమిటీ హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖను అతనికి అందజేసింది. ఆయనతో తదుపరి సమావేశం డిసెంబర్ 3న జరగనుంది. దీని తరువాత వాంగ్‌చుక్, అతని మద్దతుదారులు తమ నిరాహార దీక్షను విరమించాలని…