Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి
- జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం
- కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి
- ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయిన కారు
- మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో చామలు మోర్‌లో చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
Read Also: Harish Rao: తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ధ్వజం..
Also Read
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం తమ గ్రామమైన మలికోట్ నుండి చస్సానాకు కారులో వెళుతున్నారు. ఈ సమయంలో డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కుల్చా దేవి (27), కుమారుడు నీరజ్ సింగ్, ఆమె మేనల్లుడు సంధూర్ సింగ్ (19) అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు
గాయపడిన వారిలో చంకర్ సింగ్ (32) దేవి భర్త, అతని సోదరుడు ధుంకర్ (19), మేనల్లుడు అజయ్ సింగ్ (18) ఉన్నారు. వారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వారందరూ రియాసి జిల్లా మలికోటే వాసులేనని అధికారులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!