జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ పురస్కరించుకుని ఐదు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు (శనివారం) సెలవులు ప్రకటించాయి.
Sonam Wangchuk: హోం మంత్రిత్వ శాఖ హామీ మేరకు సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తాజాగా ఆయనని జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండేను కలుసుకున్నాడు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ అత్యున్నత కమిటీ హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖను అతనికి అందజేసింది. ఆయనతో తదుపరి సమావేశం డిసెంబర్ 3న జరగనుంది. దీని తరువాత వాంగ్‌చుక్, అతని మద్దతుదారులు తమ నిరాహార దీక్షను విరమించాలని…
Jammu Kashmir: బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ సైట్‌లో భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిందని, అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఇంకా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రవాది నుంచి ఉపయోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని ఉమ్మడి బృందం హతమార్చిందని చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, 2…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైన, పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల్ని కాల్చిచంపారు. ఆదివారం రోజు గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ వద్ద నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు భవన కార్మికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
International Marathon in Jammu Kashmir: ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. లోయ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్‌లో 59 మంది విదేశీయులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా రెండు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో రూ.3…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రి వర్గం కేంద్రాన్ని కోరింది. తాజా తీర్మానం జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా గుర్తింపును పునురుద్ధరించే ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్‌కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
Presidents rule revoked in Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సమైక్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన నోటిఫికేషన్లో జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (34/2019) సెక్షన్ 73 ద్వారా అందించబడిన…