Assembly Election Results 2024 Live Updates: ఈరోజు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది.
Assembly Elections: హరియాణా, జమ్మూకశ్మీర్ రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ముందుండగా, జమ్మూ కాశ్మీర్లో మాత్రం ‘ఇండియా కూటమి’ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. అయితే, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తన ప్రాభవాన్ని మరింత విస్తరించుకోవాలని ఆశించగా.. నిరాశ తప్పలేదు.…
Assembly Election Results: ఈరోజు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా మెజారిటీ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని, కాశ్మీర్‌లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఈ రెండు కేసులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అందిన సమాచారం ప్రకారం పోలీసులు, ఆర్మీ పెట్రోలింగ్ బృందం జమ్మూలోని ఘరోటా ప్రాంతంలో రోడ్డు పక్కన అనుమానాస్పద వస్తువును కనుగొన్నారు. అయితే దానిని పరిశీలించగా అది పేలుడు పదార్థంగా అనుమానించారు. ఈ…
Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాద నేత, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ తాను 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఐక్య, స్వతంత్ర కాశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు.
Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు.