జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు. ఈ క్రమంలో.. ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే వారిని పట్టుకుని విచారించారు. విచారణలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులని తేలింది. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీరు ఏదైనా నేరం చేయబోతున్నారా అనే విషయంపై విచారణలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: Hyderabad Road Accident: లంగర్‌హౌస్‌లో ఇద్దరు.. చర్లపల్లిలో ఒక చిన్నారి మృతి
హంద్వారా నార్కో టెర్రర్.. మాడ్యూల్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ శనివారం ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలోని మూడు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ మాడ్యూల్ 2020 జూన్ 11న వెల్లడైంది. ఈ కేసుకు చెందిన మునీర్ అహ్మద్ బండేను నవంబర్ 20న అరెస్టు చేశారు. హంద్వారా నార్కో టెర్రర్ మాడ్యూల్ నుంచి సుమారు రూ. 2.5 కోట్ల నగదు, 25 కిలోల హెరాయిన్, కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మాడ్యూల్‌లో అబ్దుల్ మోమిన్ పీర్, సయ్యద్ ఇఫ్తికార్, ఇస్లాం ఉల్ హక్, సలీం ఆంద్రాబీ, మునీర్ అహ్మద్‌బండేతో పాటు గురల్ జమ్ము రైతు రమేష్ కుమార్‌తో సహా దాదాపు డజను మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన అఫాక్ అహ్మద్ వానీ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి. మోమిన్ పీర్, సయ్యద్ ఇఫ్తికార్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు.
Read Also: Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?
ఈ ముగ్గురూ నార్కో టెర్రర్ మాడ్యూల్‌లో భాగమైనందున ప్రభుత్వం వారిని తొలగించింది. మునీర్ అహ్మద్ బండే, అఫాక్ అహ్మద్ వనీ, ఇఫ్తికార్ అహ్మద్‌ల కార్యాలయాలపై ఎన్‌ఐఏ బృందం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని పత్రాలను కూడా ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. కాగా.. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఘటనలో జమ్మూ సాంబ కథువా రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) శివకుమార్ శర్మ మాట్లాడుతూ.. రింగ్ రోడ్‌లో అదనపు పోలీసు చెక్‌పోస్టులు, పోలీసు పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విజయ్‌పూర్-అఖూనార్ రింగ్ రోడ్డులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డీఐజీ.. ఈ ఆదేశాలు ఇచ్చారు. రింగ్‌రోడ్‌లో దేశ వ్యతిరేక, వికృత చేష్టల ఆగడాలపై నిఘా ఉంచేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు.