Omar Abdullah: దాదాపుగా ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఇటీవల మొదలయ్యాయి. ఈ రోజు అసెంబ్లీ ముగింపులో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి రోడ్‌మ్యాప్‌ను అనుసరించినట్లయితే, రాష్ట్రం ఎన్నటికీ కేంద్ర పాలిత ప్రాంతంగా మారేది కాదని అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 2000లో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌కి ఎక్కువ స్వయంప్రతిపత్తి కోసం అసెంబ్లీ తీర్మానాన్ని అమోదించినప్పుడు న్యూఢిల్లీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించిందని, అయితే వాజ్‌పేయి తన తప్పుని తెలుసుకుని, చర్చల కోసం అప్పటి న్యాయమంత్రిని నియమించారని అన్నారు. అయితే, అతను మరణించారని అన్నారు.
Read Also: First Kiss: “తొలి ముద్దు”కు దూరమవుతున్న జపాన్ హైస్కూల్ స్టూడెంట్స్..
జమ్మూ కాశ్మీర్‌లో విభజించిన ప్రాంతాల ప్రజలను కలిపేందుకు వాజ్‌పేయి రోడ్లను తెరిచారని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు, వాజ్‌పేయి చూపిన మార్గాన్ని మరియు రోడ్‌మ్యాప్‌ను మధ్యలోనే వదిలేసి, ప్రజలను కలిపే బదులు, దూరాలు సృష్టించబడుతున్నాయి… జమ్మూ కాశ్మీర్‌పై వాజ్‌పేయి రోడ్‌మ్యాప్‌ను అమలు చేసి, అనుసరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. వాజ్‌పేయి గొప్ప దార్శనికుడని, లాహోర్ బస్సును ప్రారంభించి మినార్-ఏ – పాకిస్తాన్ వెళ్లిన మహోన్నత వ్యక్తి అని ఒమర్ అబ్దుల్లా కీర్తించారు. ‘ఇన్సానియత్, (మానవత్వం), జంహూరియత్ (ప్రజాస్వామ్యం) మరియు కాశ్మీరియత్ (కాశ్మీరీ ప్రజల గుర్తింపు)’ అనే అతని నినాదం అతడి రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుందని, బహుశా ఈ నినాదాన్ని లేవనెత్తిన మొదటి, చివరి నాయకుడు అతనే అని అన్నారు.