ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది.
Encounter In Jammu: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం, కుల్గాం జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైందని, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారని, అలాగే ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు.…
Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
Supreme Court: ఈ రోజు (గురువారం) వేర్పాటు వాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఉగ్ర దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని తెలిపింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన డిబేట్ లో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చాస్, కొత్వాడా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2 పారా (SF)కి చెందిన ఎన్‌బీ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ వీరమరణ పొందారు. సబ్-ఇన్‌స్పెక్టర్ రాకేష్ 09 నవంబర్ 2024న భారత్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించిన జాయింట్ సీఐ ఆపరేషన్‌లో భాగమని సైన్యం తెలిపింది.
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. ప్రధాన శ్రీనగర్‌లోని టీఆర్సీ కార్యాలయం సమీపంలోని ఆదివారం మార్కెట్లో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఉన్న జనం ఈ పేలుడులో 10 మంది గాయపడినట్లు సమాచారం. ఒక రోజు ముందు, ఖన్యార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.