ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్…
Terror Attack: జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు.
శ్రీనగర్ కు బయలుదేరి వెళ్తున్నారు అమిత్ షా. కాగా, శ్రీనగర్ వెళ్లిన తర్వాత అన్ని ఏజెన్సీలతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. కాగా, అంతకుముందు, పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంతీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మృతిచెందాడు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత…
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ…
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో జరిగిన అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషులు, మహిళలు చిన్న చిన్న దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యక్తమవుతోంది.
ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.