ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది. కాగా.. ఇంత వరకు ఎమ్మెల్యేలకు నెల జీతం కూడా రాలేదు. ఈ అంశాన్ని ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి తీసుకెళ్లారు. వేతనాల జాప్యం దృష్ట్యా, ఎమ్మెల్యేల జీతాల చట్టపరమైన నిబంధనలకు సంబంధించి వివరణ కోరుతూ స్పీకర్ రాథర్ అధికారికంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
READ MORE: Manu Bhaker: ఖేల్‌రత్న నామినీల జాబితాలో మనుభాకర్ పేరు తొలగింపు..!
ఈ అంశంపై వెంటనే స్పందించి.. వివరాలు అందజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల జీత భత్యాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టే అధికారం శాసనసభకు ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 31 ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతంపై స్వంత చట్టాన్ని రూపొందించే వరకు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయిస్తారు. జీతాలు, అలవెన్సుల్లో మార్పులు చేసేహక్కు అసెంబ్లీకి ఉంది.
READ MORE: Fake Aadhaar: ఈ 5 జిల్లాల్లో ప్రజల సంఖ్య కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువ!
ఇదిలా ఉండగా..ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించే తీర్మానాన్ని జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ఇటీవల అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని ఆ తీర్మానం ప్రవేశపెట్టగా.. బీజేపీ ఎమ్మెల్యేలు, సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఈ తీర్మానం ప్రతులను బీజేపీ సభ్యులు చించారు. పేపర్ ముక్కలను వెల్‌లోకి విసిరారు. లంగేట్ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఈ గందరగోళం మధ్య స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు దీనికి మద్దతిచ్చారు. దీంతో ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.