Encounter In Jammu: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం, కుల్గాం జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైందని, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారని, అలాగే ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా బెహిబాగ్ ప్రాంతంలో ఉన్న కద్దర్ గ్రామంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.
Also Read: Vijay On Amit shah: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన నటుడు
గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు 5 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం ఉంది. ఆ తర్వాత భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట నిఘా ఇన్‌పుట్ ఆధారంగా, భారత సైన్యం కుల్గామ్‌లో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించబడ్డాయని, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ఆర్మీ ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు.
OP KADER, Kulgam
On 19 Dec 24, based on specific intelligence input regarding presence of terrorists, a Joint Operation launched by #IndianArmy & @JmuKmrPolice at Kader, Kulgam. Suspicious activity was observed by vigilant troops and on being challenged, terrorists opened… pic.twitter.com/9IxVKtDZkl
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) December 19, 2024