Terrorist Killed: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఇక్కడ ఉగ్రవాదులపై ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కమల్‌కోట్ ప్రాంతం నుంచి చొరబాటుదారులు చొరబడేందుకు ప్రయత్నం చేసారు. దాంతో సైనిక సైనికులతో వారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. Also Read: Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు.. కార్ల అద్దాలు ధ్వంసం ఎన్‌కౌంటర్ గురించి…
శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ముబారక్ గుల్ చేత ప్రమాణం చేయించారు.
జమ్మూకాశ్మీర్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్…
Presidents rule revoked in Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సమైక్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన నోటిఫికేషన్‌లో జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (34/2019) సెక్షన్ 73 ద్వారా అందించబడిన…
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జత కలిసి ఎన్నికల బరిలోకి దిగింది.
హర్యానా ఎన్నికల ఫలితాల తీర్పును విశ్లేషిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. హర్యానా ఎన్నికల్లో హస్తం పార్టీకి అనూహ్య దెబ్బ ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ చూసి మంచి జోష్‌లో కనిపించింది. కౌంటింగ్ ప్రారంభంలో కూడా ఊహించిన ఫలితాలే వచ్చాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.