ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది.
చిరు – అనిల్ మరో షెడ్యూల్ స్టార్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా…
ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది. ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి, ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రెండువైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి. యుద్ధం కొనసాగితే.. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి.. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది.…
యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.…
Israel Iran: ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ప్రపంచం భయపడుతోంది. శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ? ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..…
Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్‌కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
Iran-Israel : ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.
US Intelligence Leaked: క్లాసిఫైడ్ అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం లీకైంది. సున్నితమైన సమాచారం లీక్ కావడంతో అమెరికా అధికారుల్లో ఆందోళన పెరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడికి సంబంధించిన వివరాలు లీకైన ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది.