ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అలాంటిది ఏమీ లేదని.. ఇజ్రాయెల్ వాదనలు అబద్ధమని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ReginaCassandra : పొట్టి దుస్తుల్లో రెచ్చగొడుతున్న రెజీనా
తాజాగా ఇరాన్ క్షిపణి ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా సైరన్లే మోగాయి. బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందాలని ప్రజలను రక్షణ దళాలు కోరాయి. అయితే ఇరాన్ క్షిపణి దాడులకు తిరిగి సమాధానం చెప్పాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించారు. రక్షణ దళాలు ప్రస్తుతం ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెల్ అవీవ్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇక మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు.. పిలిచినప్పుడు పీఎస్‌కు రావాలని..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా భీకర దాడులు జరిగాయి. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇంతలో అమెరికా జోక్యం పుచ్చుకుని ఇరాన్‌లోని మూడు ముఖ్యమైన అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అనంతరం ఇజ్రాయెల్ కూడా దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. మొత్తానికి మంగళవారం ఉదయం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ వెల్లడించారు. తొలుత ఇరాన్ అంగీకరించలేదు. అనంతరం కాల్పుల విరమణ జరిగినట్లుగా ఇరాన్ పేర్కొంది.