పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. టెహ్రాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. ఈ ఘటనలో రెండు ఇరానియన్ ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు వీడియోను ఐడీఎఫ్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
ఇది కూడా చదవండి: Pedhi : డిజిటల్ రైట్స్ డీల్‌తో సంచలనం సృష్టించిన ‘పెద్ది’..
ఈ రెండు జెట్‌లు ఇజ్రాయెల్ విమానాలను అడ్డగించడానికి ఇరాన్ ఉపయోగించినట్లు సమాచారం. ఇక ఇరానియన్ డ్రోన్ యూనిట్లు, ప్రసార సౌకర్యాలను కూడా ఐడీఎఫ్ దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెహ్రాన్‌లోని ఒక విమానాశ్రయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం.. రెండు ఇరానియన్ F-14 ఫైటర్ జెట్‌లను ధ్వంసం చేసిందని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Iran-India: తక్షణమే టెహ్రాన్ ఖాళీ చేయండి.. పౌరులకు భారత్ పిలుపు
ఈ రెండు ఫైటర్ జెట్లను 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా డెలివరీ చేసింది. అప్పటి నుంచి ఆ రెండు ఫైటర్ జెట్‌లను ఇరాన్ ఇప్పటికీ నిర్వహిస్తోంది. ఈ విమానాలు ఇప్పటికీ క్రియాశీలకంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక డ్రోన్లు నిల్వ చేసిన కంటైనర్లపైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ వీడియోను కూడా పంచుకుంది. అలాగే టెహ్రాన్‌లోని ఇరాన్ రాష్ట్ర ప్రసార భవనంపై జరిగిన దాడి వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం పంచుకుంది.
ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని చంపడం వల్ల రెండు దేశాల మధ్య వివాదం ముగిసిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగుతున్న సైనిక చర్యలను సమర్థించారు. అవి సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడం కంటే అంతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో వీటో చేశారని.. అది సంఘర్షణను మరింత తీవ్రతరం చేస్తుందని భయపడిన తర్వాత నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
RECAP of Our Recent Operations Over Tehran:
🛫 Strike on two F-14 fighter jets that were located at an airport in Tehran. These jets were intended to intercept Israeli aircraft.
❌ Thwarted a UAV launch attempt toward Israel.
🎯 Eliminated a launch cell minutes before launch… pic.twitter.com/y1gY7oBz99
— Israel Defense Forces (@IDF) June 16, 2025