Iran: టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..
- మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు..
- టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామని ఇరాన్ వార్నింగ్..
- సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..
- ఇరు దేశాల మధ్య మళ్లీ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్‌కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 సరైన సమయంలో, ఖచ్చితత్వంతో ఇజ్రాయిల్‌ని నాశనం చేయడానికి, టెల్ అవీవ్-హైఫాలను నేలమట్టం చేయడానికి నిర్వహిస్తాము’’ అని మేజర్ జనరల్ జబ్బారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియర్ సార్ స్పందించారు. ‘‘ యూదు ప్రజలు చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకున్నారంటే అది ఇదే. మీ శత్రువు మిమ్మల్ని నానశం చేస్తామని చెబితే నమ్మంది- మేము అందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.
Also Read
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
జబ్బారికి ముందు ఇజ్రాయిల్‌ని మరో ఇద్దరు ఇరాన్ అధికారులు ఇదే విధంగా బెదిరించారు. IRGC డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ ఫడవి, IRGC యొక్క ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో ఇరాన్ తన క్షిపణి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. దీని కోసం ఇరాన్ చైనా నుంచి 1000 టన్నుల రాకెట్ ఫ్యూయల్‌ని తెప్పించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ భూగర్భంలో సరికొత్త మిస్సైల్ సిటీని ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇజ్రాయిల్-అమెరికా కలిసి ఇరాన్‌లోని అణు కేంద్రాలపై సంయుక్త దాడికి ఇదే సరైన సమయమని పలువురు అమెరికన్-ఇజ్రాయిల్ నిపుణులు వాదిస్తున్నారు. బహుళ అణు బాంబుల్ని రూపొందించేందుకు తగినంత ఆయుధ గ్రేడ్ యురేనియంని ఇరాన్ ఉత్పత్తి చేసే దశలో ఉందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ (AIPAC)లో మాజీ పరిశోధన అధిపతి కాలిన్ విన్‌స్టన్ అన్నారు.
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!