కెనడాలోని టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థుల సహా మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాగా మృతులను హర్‌ప్రీత్ సింగ్,…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా చైనాలోని పలు నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్‌జెన్‌లో తాజాగా అధికారులు కఠినమైన లాక్‌డౌన్ విధించారు. దీంతో షెన్‌జెన్ నగరంలోని 90 లక్షల మంది ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జిలిన్…
సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది.…
పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. ఇటీవల భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. మార్చి 9న సాయంత్రం 6:43 గంటలకు భారత క్షిపణి తమ భూభాగంలోని మియా చన్ను ప్రాంతంలో పడిందని పాకిస్థాన్ తెలిపింది. ప్రాణ నష్టం జరగకపోయినా ఓ గోడ కూలిపోయిందని పాకిస్థాన్ ప్రభుత్వం…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నిర్ణయాత్మక స్థితికి చేరుకుంది. రష్యా సైనిక దాడి ప్రారంభించి 12 రోజులు అవుతోంది. తన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి మళ్లేది లేదని పుతిన్ అంటున్నాడు. మరోవైపు, రష్యా దాడులను నిలువరించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించించింది. రష్యా దాడులను జెలెన్‌స్కీ టెర్రరిజంతో పోల్చాడు. అది యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు -ఐసీసీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది.…
ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘నో ఫ్లై జోన్’. రష్యా దాడులు ఉధృతం కావటంతో తమ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నోఫ్లై జోన్ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా…
ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు పుతిన్ సూచించారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ…
ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 15 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న వలస సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డోవాలోకి…