America: అగ్రరాజ్యం కాదు.. తుపాకుల రాజ్యం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 ఫిబ్రవరిలో నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల టీనేజర్ ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో కాల్పులకు పాల్పడ్డాడు. AR-15 రైఫిల్‌తో అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. అభం శుభం తెలియని చిన్నారులను అకారణంగా కాల్చి చంపటం అందరి మనసులను కలచివేసింది. అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోన్న గన్ కల్చర్‌కు ఇది ఒక ఉదాహరణ. సరిగ్గా ఐదేళ్ల తరువాత నాటి ఫ్లోరిడా ఘటన నేడు టెక్సాస్‌లో పునరావృతమైంది.
టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డే నగరంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ ఘోరం జరిగింది. నాటి ఫ్లోరిడా ఘటనలో మాదిరిగానే 18 ఏళ్ల టీనేజర్ సాల్వడార్ రామోస్ AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను కాల్చి చంపాడు. అయితే దుండగుడిని కూడా అక్కడిక్కడే కాల్చి చంపారు. షూటింగ్‌కు ముందు అతడు తన బామ్మను కూడా కాల్చి చంపాడు. ఆ తరువాత వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఈ ఘోరానికి తెగబడ్డాడు. ఈ ఘటన అధ్యక్షుడు జో బైడెన్‌ను కలచివేసింది. దీనిపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దుర్ఘటనకు సంతాప సూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం చేయాలని బైడెన్ కోరారు.
Also Read
- Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
- El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
- Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
- Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
Texas School Shooting: అమెరికాలో ఫైరింగ్… స్కూల్ పిల్లలతో సహా 21 మంది దుర్మరణం
అమెరికాలో అకారణంగా కాల్చి చంపే ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే టీనేజర్లు కాల్పులకు పాల్పడటం వంటి అరుదైన ఘటనలు జరిగినపుడు మాత్రమే అక్కడి సమాజం, పాలకులు తీవ్రంగా స్పందిస్తారు. తుపాకీ సంస్కృతిని తీవ్రంగా విమర్శిస్తారు. తరువాత మళ్లీ పాత కథే. నిజానికి అమెరికా సంస్కృతిలో తుపాకులు అంతర్భాగం. బ్రిటన్ వలసరాజ్యంగా ఉన్న రోజుల నుంచే అమెరికా ప్రజలు ఆత్మరక్షణకు తుపాకులు చేతపట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. ఇక అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులు తుపాకులు కలిగివుండే స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు అమెరికాలో మూడవ వంతు వయోజనులు వ్యక్తిగత తుపాకీ కలిగివున్నారు.
అమెరికాలో ఈ గన్ కల్చర్ రోజుకు 53 మందిని బలి తీసుకుంటోంది. అక్కడ జరిగే హత్యల్లో 79శాతం తుపాకులతో కాల్చి చంపినవే. చాలా ఆత్మహత్యలు తుపాకులతో చేసుకున్నావే. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.. కాని తగ్గటం లేదు.
21 ఏళ్లు దాటి, నేర చరిత్ర లేని ఆరోగ్యవంతులైన పౌరులు తుపాకీ కలిగి వుండటం అమెరికాలో చట్టబద్దం. మైనర్లు ఫేక్ డాక్యుమెంట్స్‌తో విక్రయదారులకు అదనంగా డబ్బులు ఇచ్చి అక్రమంగా గన్ లైసెన్స్ పొందుతున్నారు. అంటే, ఆట తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా నిజమైన తుపాకులు దొరుకుతాయి. దాంతో బడి పిల్లలకు ఇదో అడ్వంచర్‌గా మారింది.
అమెరికాలో ఈ గన్ కల్చర్‌కు ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది బలయ్యారు. వారిలో నలుగురు దేశాధ్యక్షులు కూడా ఉన్నారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ. గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తుపాకీ తూటాలకు బలయ్యారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ పై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికాలో జరిగే నేరాలకు ఆయుధాలు కలిగివుండటమే ప్రధాన కారణమని 50 ఏళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రకటించారు. తుపాకీ సంస్కృతి ఈ భయంకర పరిణామాలకు కారణమని హెచ్చరించారు.
అమెరికాలో గన్ కల్చర్‌కు చెక్ పెట్టాలని ప్రభుత్వాలు భావించినా ఆయుధ వ్యాపారాలు అడ్డుకుంటారు. ముఖ్యంగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ -NRA ఈ విషయంలో ముందుంటుంది. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఇది లాబీయింగ్‌తో అడ్డుకుంటూ వస్తోంది. ఇటీవల బైడెన్ తీసుకువచ్చిన ఘోస్ట్ చట్టం పరిస్థితి కూడా అదే. అమెరికాలో 63 వేల మంది ప్రభుత్వ అనుమతి పొందిన ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా దాదాపు లక్ష కోట్ల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. దీనికి తోడు చట్ట విరుద్ధంగా మరో పదివేల కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతుంది. కనుక, అంత ఆదాయం ఉన్న ఈ వ్యాపారాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే అమెరికాలో గన్ కల్చర్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!