ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య…
Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మన్నెగూడలో జరిగిన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు! వేదిక వద్ద ర్యాలీగా వచ్చిన నూతన…
బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోడీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోడీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ,…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్'లో "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని రాశారు.