Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ భగీదారీ బాయి సమ్మేళన్లో మాట్లాడుతూ..ప్రధాని మోడీకి చేసేదంతా ‘‘షో’’నే అని, ఆయకు సరైన విషయం లేదని అన్నారు. ఆయన ఒక పెద్ద ప్రదర్శన, ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత, ఆయనతో ఒకే గదిలో కూర్చున్న తర్వాత,…
Youth vs Indian Politics: రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీలౌతున్నారు. నెలకు ఓ లక్ష రూపాయలు జీతం, చిన్న కారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు. అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ.. సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. కాస్త…
Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Rahul Gandhi: ప్రముఖ జ్యోతిష్యురాలు, ఆస్ట్రో శర్మిష్ట ఇటీవల చాలా ఫేమస్ అయ్యారు. గత నెలలో ఎయిర్ ఇండియా ప్రమాదానికి కొన్ని వారాల ముందు, ప్రమాదాన్ని అంచనా వేయడంతో ఒక్కసారిగా శర్మిష్ట పేరు మారుమోగింది. దీంతో ఒక్కసారిగా ఈమె దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. 2025లో ప్రపంచంలో పెద్ద విమానాలు జరగబోతున్నాయని అక్టోబర్ 2024 ముందే మొదటిసారిగా ఆమె ప్రిడిక్ట్ చేశారు. ఇదే విషయాన్ని జూన్ 5, 2025న మరోసారి అంచనా వేశారు.
మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.