Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి.. నాయకుడు ఎక్కడో ఉండి, ప్రజలు ఎక్కడో ఉండేలా ఉండకూడదని తెలిపారు. తాను పదవీ విరమణ చేశానని.. పెదవి విరమణ చేయలేదన్నారు. బూతులు మాట్లాడిన వారెవరూ గతంలో అసెంబ్లీలోకి రాలేదని గుర్తు చేశారు. ప్రజలు ఆదర్శవంతంగా ఉన్న వారిని గెలిపించాలని సూచించారు. కొత్త వారికి జ్యేష్ఠ కార్యకర్తలు మార్గదర్శకంగా మారాలన్నారు. పదవులు ఆశించకుండా, ప్రజల్లో తిరిగినా రాజకీయ నాయకుడుగా గుర్తించబడతారు.. రాజకీయం అంటే పదవులకు సోపానం అనుకోకూడదన్నారు.
READ MORE: Revanth Reddy: ఢిల్లీ టూర్‌లో రేవంత్‌రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ఆర్టికల్ 370 రద్దుతో అందరూ సంతోషించారు.. రక్తపాతం చిందించకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని వెంకయ్యనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. “ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం మూడవ విజయం.. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. మీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటే నక్సల్స్ కూడా బయటకొచ్చి ఎన్నికల లో పోటీ చేయండి.. తుపాకీ పోలీసుల చేతిలో ఉండచ్చు కానీ ప్రతీ ఒక్కరి చేతిలో ఉండకూడదు.. మత కలహాలు దాదాపు తగ్గిపోయాయి.. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుంది.. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మాట్లాడటం నా పని కాదు.. నూతన విద్యా విధానం తీసుకొచ్చి పాఠ్యపుస్తకాలలో కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొస్తోంది.. MBBS, ENGINEERING లను కూడా మాతృభాషలో చదువుకునేలా చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.. మాతృభాష కళ్ళు అయితే ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను తెలుగులో పరిపాలన చేయాలని కోరాను.. తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడానికి ఏం ఇబ్బంది.. తెలుగులో ఇవ్వడం దయాదాక్షిణ్యమా.. ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు పర్యాటకం పెరిగింది.. ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారత్ ను పెట్టిన వ్యక్తి మోడీ..” అని వెల్లడించారు.