Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి..
Modi vs Priyanka: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు…
K.A. Paul: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు…
Rajmata Vijaya Raje Scindia: భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యురాలు, జనసంఘ్ ప్రముఖ నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు నివాళులు అర్పించారు. సామాజిక సేవ పట్ల ఆమె అంకితభావం, భారతీయ సంస్కృతిపై ఆమెకున్న విశ్వాసం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.