Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!
- ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
- సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు
- సుమారు 200 మంది ప్రత్యేక అతిథులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చడ్డాను అతడు వివాహమాడాడు. ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరిలోని సవోయ్ హోటల్‌లో శనివారం కుల్దీప్, వన్షిక పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంగీతం, నృత్యాలతో కుల్దీప్ పెళ్లి వేడుకలు సందడిగా సాగాయి.
వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు బిస్మిల్ లైవ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆయన పాటలకు కుల్దీప్ యాదవ్, వన్షిక చడ్డా స్టేజ్‌పై డాన్స్ చేశారు. అతిథులు కూడా స్టెప్పులు వేసి వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చారు. కుల్దీప్ వివాహ వేడుకకు భారత క్రికెట్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్, రింకు సింగ్ వేడుకలో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్లు పియూష్ చావ్లా, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్ సహా ప్రస్తుత టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ హాజరయ్యారు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
కుల్దీప్ యాదవ్, వన్షిక చడ్డా ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందినవారు. చిన్నప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఉండగా.. రెండు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారి.. చివరికి వివాహ బంధంగా మారింది. కుల్దీప్, వన్షిక వివాహ కార్యక్రమం సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. ముందుగా సాఫాబంధీ (పాగా కట్టే వేడుక) నిర్వహించారు. అనంతరం బరాత్ జరిగింది. తర్వాత వరమాల వేడుక జరగగా.. రాత్రి పవిత్రమైన ఫేరాలు పూర్తి చేశారు. అనంతరం మండపంలో ఇతర సంప్రదాయ కార్యక్రమాలు కూడా కొనసాగాయి.
Also Read: Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!
కుల్దీప్ యాదవ్, వన్షిక చడ్డా పెళ్లికి సుమారు 200 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వేడుక కోసం హోటల్ ప్రాంగణంలో అద్భుతమైన మండపం, సంగీత్ కార్యక్రమానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అతిథుల కోసం విలాసవంతమైన విందు ఏర్పాట్లు చేశారు. ఒక్కో ప్లేట్ ఖర్చు సుమారు రూ.6,000 వరకు ఉందని తెలుస్తోంది. నూతన జంటకు క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!