Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: అభిషేక్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2026 సీజన్‌లో ఈ పేరు మార్మోగిపోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెట్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. అభీ ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అభిషేక్ శర్మపై టీమిండియా ప్లేయర్లలో ఈర్ష్య పెరుగుతుందట. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. అభిషేక్ శర్మకు పెరుగుతున్న పాపులారిటీ చూస్తుంటే జట్టులోని ఇతర ఆటగాళ్లకు కాస్త అసూయగా అనిపిస్తోందంటూ సంజూ సరదాగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ క్రేజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఎక్కడ పర్యటించినా, అభిమానులు కేవలం అభిషేక్‌ను చూసేందుకే క్యూ కట్టేవారని గుర్తు చేశాడు.
READ MORE: Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
“స్టేడియంలో అభిషేక్‌దే హవా.. మొదట్లో అభిషేక్ కోసం వస్తున్న అరుపులు, కేకలు చూసి జట్టులోని కుర్రాళ్లు కుళ్లు కునేవాళ్లు. ఫ్యాన్స్ ఎక్కడ చూసిన అభిషేక్.. అభిషేక్ అని అరుస్తుంటారు. అసలు స్టేడియంలో ఉన్న జనాలకు మేము కనిపిస్తున్నామా? లేదా? అనే డౌట్ వచ్చేది. మేము ఉన్నా కూడా కేవలం అభిషేక్‌ను మాత్రమే చూస్తున్నారా? అని మేము నవ్వుకునేవాళ్లం.” అని సంజూ వెల్లడించాడు. భాయ్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో.. అప్పుడైనా మాకు కొంచెం లైమ్‌లైట్ దక్కుతుందని సంజూ నవ్వుతూ చెప్పాడు. అభిషేక్ గురించి అనేక విషయాలను పంచుకున్నాడు సంజూ.. ఓ విధంగా చెప్పాలంటే అభిషేక్‌ను షోలో ఆటపట్టించాడు. అంతే కాదు.. అభిషేక్ కృషి పట్టుదలను కొనియాడుతూ ప్రస్తుతం టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా కొనసాగడంపై సంజూ ప్రశంసించాడు.
ఇక అదే వేదికపై అభిషేక్ సైతం మాట్లాడాడు.. తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడటం, రాణించడం గురించి వివరించాడు. నా లక్ష్యం ఒక్కటే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో రాణించడం అని అభీ వెల్లడించాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచనని స్పష్‌టం చేశాడు. గురువు యువరాజ్ సింగ్ తనకు నేర్పిన పద్ధతుల గురించి మాత్రమే ఆలోచిస్తానన్నాడు. వాటినే అనుసరిస్తానని వెల్లడించాడు. వన్డే క్రికెట్‌లో చోటు దక్కితే తన కల సహకారమైనట్లే అని స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!