తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకి, బిజు జనతాదళ్ సీనియర్ నాయకుడు (బీజేడీ) పినాకి మిశ్రాతో వివాహం జరిగింది. మొయిత్రా, మిశ్రా 14 రోజుల క్రితం బెర్లిన్‌లో వివాహం చేసుకున్నారని ఓ టీఎంసీ సీనియర్ నాయకుడు జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై సదరు మీడియా సంస్థ ప్రతినిధి మొయిత్రా సంప్రదించినప్పుడు ఆమె స్పందించలేదు. అయితే.. ఈ వదంతుల మధ్య తాజాగా ఎంపీ మహువా మొయిత్రా అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా క్లారిటీ…
సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
"లెటర్ టూ డాడి" అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను…
ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై "మైడియర్ డాడీ" అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు…
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తదుపరి నిర్వహించనున్న భారత సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మిట్‌లో శాంతి, అహింస, ఆర్థికం, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన తెలిపారు. భారత్ సమ్మిట్‌ని కాంగ్రెస్ పార్టీ యొక్క మూలవిధానాలను ప్రతిబింబిస్తూ నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలకు చెందిన నాయకులు, మేధావులు,…