Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సొంత పార్టీ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీలో కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటారని, తనలాంటి రాజకీయ అనుభవం ఉన్నవారి అభిప్రాయాలను కూడా అడగడం లేదన్నారు. అయితే, కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తీరు ఇప్పటికీ తనకు బాధను కలిగిస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ సోనియా గాంధీ వ్యక్తిగతంగా సహాయం కోరితే చేస్తానని, రాజకీయంగా మాత్రం కాదు అని కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.
Read Also: Akhanda 2 : బాలయ్య కెరీర్ హయ్యెస్ట్.. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్
ఇక, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా ఉండేదని, హైకమాండ్‌ను కలవడం సులభమని బీజేపీ నేత అమరీందర్ సింగ్ చెప్పారు. బీజేపీలో మాత్రం పైస్థాయి నేతలను కలవడం కష్టం.. నిర్ణయాలు క్షేత్రస్థాయి నేతలతో చర్చించకుండా తీసుకుంటారని విమర్శించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనకు పంజాబ్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారు.. పంజాబ్‌లో స్థిరత్వం రావాలంటే బీజేపీ- అకాళీదళ్ కూటమి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవం ప్రకారం ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయని అమరీందర్ సింగ్ చెప్పారు.
Read Also: The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయాలు మానేసి క్రికెట్ కామెంట్రీపై దృష్టి పెట్టడం మంచిదని బీజేపీ నేత అమరీందర్ సింంగ్ ఎద్దేవా చేశారు. అలాగే, వచ్చే ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో చీలిపోతుంది.. రెండు అంకెల సీట్లు కూడా దక్కవని అన్నారు. ఇక, పాకిస్థాన్ భారత్‌లో స్థిరత్వం కోరదు.. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర కీలకం అన్నారు. మొత్తంగా పంజాబ్ భద్రత, అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని గురించి ఆలోచించాలని అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు.