Modi vs Priyanka: విపక్షాలు డ్రామాలు చేయొద్దన్న మోడీ.. ప్రధాని మోడీ ప్రియాంక ఫైర్!
- ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే మాటల యుద్ధం..
- బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ను వేదికగా చేసుకోవద్దు..
- విపక్షాల డ్రామాలను ప్రజలు నమ్మరు: ప్రధాని మోడీ..
- ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన ప్రియాంక గాంధీ ఫైర్..
- ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా?..
- చర్చలు జరపకుండా కేంద్రం డ్రామాలు ఆడుతుంది: ప్రియాంక గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi vs Priyanka: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయి.. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ వేదికగా మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. విపక్ష పార్టీల నేతల డ్రామాలను దేశ ప్రజలు నమ్మడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా? పార్లమెంట్ ప్రజల కోసం ఉన్నది.. కీలకమైన అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అని డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది కేంద్ర సర్కార్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
అయితే, విపక్షాల ఆందోళనతో లోక్ సభను మధ్యాహ్నం 12గంటలకి స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష ఎంపీలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంపీలను నినాదాలు, ఆందోళనలు చేయడానికి పార్లమెంట్ కి పంపలేదన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రశ్నోత్తరాల సమయంలో కొనసాగించేందుకు సహకరించాలని విపక్ష ఎంపీలను స్పీకర్ కోరారు.
#ParliamentWinterSession | Delhi: PM Narendra Modi says, "The MPs who have been elected to the House for the first time or who are young are very upset and unhappy. They are not being given a chance to prove their mettle. They are not being given a chance to speak about the… pic.twitter.com/VUIwmHvvIH
— ANI (@ANI) December 1, 2025
#WATCH | Delhi | On PM Narendra Modi's statement, Congress MP Priyanka Gandhi Vadra says, "… Election situation, SIR, and pollution are huge issues. Let us discuss them. What is the Parliament for? It's not drama. Speaking about and raising issues is not drama. Drama is not… pic.twitter.com/rAunLwGXhS
— ANI (@ANI) December 1, 2025
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!