భారత రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. నవంబర్ 26న దేశమంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
CM Chandrababu: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఆయనకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
Kiren Rijiju: భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో…
హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని "ఎప్పుడూ" అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని…
TPCC Mahesh Goud : బీజేపీ నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బిజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ‘‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’’…
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది.