రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని చెప్పారు.
READ MORE: CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
పత్రికలను నిషేధించారని.. కోర్టులో పిటిషన్ వేసే అధికారం కూడా లేకుండా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓట్లల్లో మెజార్టీ వచ్చిన వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అధికారం ఉందని ఆ ఓటు హక్కు రాజ్యాంగంలో ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ చేసిందని వెల్లడించారు. రాజ్యాంగం గొప్పతనం వల్ల ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారని.. ఓ సాధారణ మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. మోడీ రాజ్యాంగాన్ని ఒకటే దేశం ఒకటే చట్టం చేసిందని 3% మహిళలకు రిజర్వేషన్ రాజ్యసభలలో చేసిందని కొనియాడారు. ఆ రోజుల్లో రేడియో మాత్రమే ఉండేది.. కానీ ఈ రోజుల్లో ప్రతిదీ నిఘ ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా నా హక్కును కాదంటే ప్రజలు ఊరుకోరు బుద్ధి చెబుతారని చెప్పారు.
READ MORE: Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే