గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా విమర్శించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం యొక్క రాజ్యాంగ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
Kishan Reddy: అంబేద్కర్ జయంతి సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద్రాభంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మాటలతో విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ హత్య చేసిందని.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఘోరి కట్టారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పని చేస్తున్నామని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాజ్యాంగం…
KTR: తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆలోచన నాయకత్వం వల్లే మనకు ఈరోజు తెలంగాణ లభించింది. అంబేద్కర్ కారణంగానే మనకు అత్యుత్తమ రాజ్యాంగం లభించిందని…
తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ…
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీపీఐ నేత నారాయణ హెచ్‌సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్‌సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు…
Kishan Reddy : నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత మహాహరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతమాత మహారథి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ వర్మకి అలాగే సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఎంఎం కీరవాణి , ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన మాడుగుల నాగఫణి శర్మ, ఈటల రాజేందర్, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి,…
Republic Day 2025: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం,…
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్‌లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు…
Kishan Reddy: భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని పెంపొందించడానికి బీజేపీ చేపట్టిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించే గొప్ప పత్రిక అని పేర్కొన్నారు. అనేక దేశాలకు భారత…