T20 World Cup 2026: పాక్ కంటే దారుణంగా భారత్..! సెమీస్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్న గణాంకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Men’s T20 World Cup 2026లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, జట్టును కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఫీల్డింగ్.. కీలక మ్యాచ్‌ల ముందు భారత జట్టు క్యాచింగ్‌లో తీవ్ర బలహీనత బయటపడింది. ఒక భయంకరమైన గణాంకం ఇప్పుడు అభిమానులను, జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. టోర్నీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తున్నా, ఫీల్డింగ్ విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, క్యాచ్‌లు పట్టడంలో భారత్ ‘చివరి’ స్థానంలో నిలవడం గమనార్హం.
పాకిస్థాన్ కంటే వెనుకబడిన టీమ్ ఇండియా!
సాధారణంగా ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను విమర్శిస్తుంటారు.. కానీ, ఈ ప్రపంచ కప్‌లో భారత్ వారికంటే పేలవ ప్రదర్శన చేస్తోంది టీమిండియా.. భారత్ సక్సెస్ రేటు కేవలం 72.7 శాతంగా ఉంటే పాకిస్తాన్ సక్సెస్ రేటు 83.3 శాతంగా ఉంది.. సూపర్-8కు చేరిన అన్ని జట్లలో భారత్ క్యాచింగ్ సక్సెస్ రేటు అతి తక్కువగా ఉంది. ఇంగ్లాండ్ 87.2 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ అట్టడుగున నిలిచింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వెస్టిండీస్ మ్యాచ్‌లో బయటపడ్డ బలహీనతలు
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా, ఫీల్డింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. అభిషేక్ శర్మ.. రోస్టన్ చేజ్ క్యాచ్ వదిలేశాడు (ఆ తర్వాత చేజ్ 40 పరుగులు చేశాడు).. తిలక్ వర్మ.. రూథర్‌ఫోర్డ్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు.. మరోసారి అభిషేక్ శర్మ.. పావెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలివేశాడు.. ఒకవేళ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ క్యాచ్‌ల తర్వాత మరింత రెచ్చిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
టోర్నీలో ఇప్పటివరకు కోల్పోయిన క్యాచ్‌లు
ఈ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు మొత్తం 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేశారు. నాకౌట్ దశలో ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్లతో తలపడేటప్పుడు, ఒక్క క్యాచ్ వదిలేసినా అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ప్రమాదం ఉంది.
జట్ల వారీగా క్యాచింగ్ సక్సెస్ రేటు:
– ఇంగ్లాండ్ 87.2 శాతం
– జింబాబ్వే 85.4 శాతం
– వెస్టిండీస్ 84.6 శాతం
– పాకిస్తాన్ 83.3 శాతం
– భారత్ 72.7 శాతంగా మాత్రమే ఉంది..
అయితే, “క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి” అన్నది క్రికెట్ సామెత. సెమీఫైనల్స్ చేరిన ఆనందంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ బ్రిగేడ్, ఈ ఫీల్డింగ్ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే సెమీస్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!