CM Chandrababu: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఆయనకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విలువలతో కూడిన వ్యక్తిత్వం సీజేఐ గవాయ్ ది.. అందరిని సమానంగా చూడటం CJI గవాయ్ లో గొప్ప లక్షణం అన్నారు. మన రాజ్యాంగం గొప్పది కాబట్టి చాయ్ వాలా కూడా ప్రధాన మంత్రిగా మోడీ అవ్వగలిగారు అని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప వాటిలో ఒకటి.. ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశం పురోగతి సాధిస్తోంది అని చంద్రబాబు అన్నారు.
Read Also: Akhanda2Thaandavam : 3Dలో అఖండ 2.. బోయ – బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్ అయ్యా
అయితే, ఎకనమిక్ పాలసీలు దశాబ్దాలుగా మారుతుండటం చూస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్ లో హ్యూమన్ రిసోర్స్ ను ప్రపంచానికి భారత్ అందిస్తుంది.. భారత్ 2038 నాటికి ప్రపంచంలో రెండో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుంది. ఇక, సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి ఎడిటర్, రైటర్ అయ్యారు.. అందరి క్యారెక్టర్ ను అతనే డిసైడ్ చేసే పరిస్థితి నెలకొనడంతో అందరం ఇబ్బంది పడుతున్నాం.. ధన, పేద, ఇతర బేధాలు లేకుండా ప్రతి ఒకరికి ఓటు హక్కు కల్పించిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది అని చంద్రబాబు తెలిపారు.