Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోసం ఈ తీర్పు వెల్లడించనుంది.
Read Also: kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్‌పై తాజా అప్డేట్
ఈ అంశాన్ని విచారించిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన అధికారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే సుప్రీంకోర్టు ‘‘పనిలేకుండా’’, ‘‘శక్తిహీనులై’’ ఉంటుందని కేంద్రం ఆశించకూడదని గవాయ్ సెప్టెంబర్ నెలలో స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 8న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ఒక బిల్లును అనవసరంగా ఆలస్యం చేయకూడదని, బిల్లుల నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గడువు విధించింది. ఈ తీర్పు తర్వాత, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతిని సంప్రదించింది. దీంతో ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు సలహా కోసం పంపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని బిల్లులకు ఒకే గడువు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ బిల్లుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, ఒకే రూల్ పనిచేయదని, కోర్టులు గవర్నర్ పనిని బలవంతంగా నియంత్రించకూడదని చెప్పింది. గవర్నర్‌లకు బిల్లులపై సంతకం చేయాలా.? వద్దా? అని నిర్ణయించే స్వేచ్ఛ ఉండాలని, ముఖ్యంగా బిల్లుల రాజ్యాంగబద్ధతను పరీక్షించే హక్కు గవర్నర్‌లకు ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.