TPCC Mahesh Goud : బీజేపీ నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బిజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ‘‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన మహేష్ కుమార్ గౌడ్, దేశ సమగ్రత, అఖండతకు ముప్పు వాటిల్లేలా మోడీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారమే ధ్యేయంగా, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Balakrishna : టాలీవుడ్ లో ఆ అరుదైన రికార్డు బాలయ్యదే..
రాజకీయ స్వలాభం కోసం బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన గౌడ్, దేశాన్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతోన్న దుష్శక్తులను ప్రజల శక్తితో ఎదుర్కోవాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్రం నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకూ ఉద్యమాలు సాగుతాయని తెలిపారు. పది ఏళ్ల పాలన తరువాత కూడా అభివృద్ధిపై చెప్పుకోదగినది ఏమీ లేకుండా పోయిందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని ఊహించుకున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని భిన్న కోణాల్లో అధ్యయనం చేయగలిగారని గౌడ్ తెలిపారు. సామాజిక న్యాయం కోసం కులసర్వేను రాహుల్ ప్రారంభించారని, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దానిని విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పీసీసీ కార్యవర్గంలో 70 శాతం స్థానాలు ఇచ్చామని, సామాజిక సమానత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు ప్రధాని పదవి మీద ఆసక్తి ఉండొచ్చునేమో కానీ దేశప్రేమ ఉండదని ఎద్దేవా చేశారు. ఒకపక్క పాకిస్తాన్‌పై యుద్ధం చేయమంటూ ఘంటాపథంగా మాట్లాడుతారు, కానీ ట్రంప్ సూచనతో వెంటనే వెనక్కి తగ్గతారని వ్యాఖ్యానించారు. 92 వేల మంది పాకిస్తానీ సైనికులను చేతిలో పెట్టిన గొప్ప నాయకత్వం ఇందిరా గాంధీదేనని గుర్తుచేశారు. దేశం యుద్ధంలో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అన్న విషయంపై మోడీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..