దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాల తరహాలో భారతదేశంలోనూ మత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi High Court : భారతదేశంలో విదేశీ పౌరుల నివాసం, సెటిల్‌మెంట్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగం విదేశీ పౌరులెవరూ భారతదేశంలో నివసించే, స్థిరపడే హక్కును పొందేందుకు అనుమతించదని కోర్టు పేర్కొంది.
కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని కేరళ మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు.
పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్‌పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ వరప్రసాద్‌కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు. Read Also: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి…
భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్‌లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10తేదీ వరకు అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో రాజ్యాంగంపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి…